తాడిచెర్ల ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా నరేష్ గౌడ్
భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులైన బొబ్బిలి నరేష్ గౌడ్‌కు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో దక్కిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.