నందవరంలో ఘనంగా చౌడేశ్వరి దేవి వేడుకలు

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసిన చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలను గురువారం నాడు భక్తులు వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి జయంతి వేడుకల సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం బీసీ రాజారెడ్డి చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.