ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు
W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వెలసిన శ్రీ బండి ముత్యాలమ్మ తల్లిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి మోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది తగిన జాగ్రత్తలు చేపట్టారు.