'ఆశా కార్యకర్తల మహాసభలను విజయవంతం చేయాలి'
AKP: ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని అచ్యుతాపురం మండల కన్వీనర్ కే. సోమనాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం అచ్యుతాపురంలో ఆశా కార్యకర్తల మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 8, 9 తేదీల్లో అనకాపల్లిలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వారికి కనీస వేతనాలు అమలు చేసి పని భారం తగ్గించాలన్నారు.