ధ్వజస్తంభ ప్రతిష్టాపన, భగీరథ మహర్షి విగ్రహ ఆవిష్కరణ
KRNL: కోసిగి (మం) సజ్జలగుడ్డం గ్రామంలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంలో నవగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపనతో పాటు శ్రీ భగీరథ మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి దేవాలయాల్లో ఆకు పూజ, కుంకుమార్చన, బిల్వర్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రాలయం MLA బాలనాగిరెడ్డి, కోసిగి మండల వైసీపీ నాయకులు విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.