ఈ నెల 22నుంచి డిగ్రీ పరీక్షలు

SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఐదవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 22వ తేదీ నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయ్యాయని,ఈ విషయాన్ని డిగ్రీ విద్యార్థులు గమనించగలరని పేర్కొన్నారు.