గువ్వల బాలరాజు చేరికతో అంతర్మథనంలో మాజీ ఎంపీ

గువ్వల బాలరాజు చేరికతో అంతర్మథనంలో మాజీ ఎంపీ

NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంతో శుక్రవారం నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ పోతుగంటి రాములు అంతర్మథనం పడ్డారు. గువ్వల బీజేపీలో చేరికను వ్యతిరేకించిన రాములు పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తిరిగి బీఆర్ఎస్‌లోకి వస్తారనే ప్రచారం వినిపిస్తోంది. గతంలో గువ్వల బాలరాజు వైఖరి నచ్చకనే రాములు బీజేపీలో చేరినట్లు సమాచారం.