ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం.. జోగి కుటుంబంపై కేసు
కృష్ణా: వైద్య పరీక్షలకు జోగి రమేశ్‌ను పోలీసులు నిన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో అతని అనుచలరులతోపాటు రమేష్ భార్య శంకుతల, కుమారులు రాజీవ్, రోహిత్ వచ్చారు. ఈ నేపథ్యంలో అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టి ఆసుపత్రిలోని క్యాజువాల్టీ వార్డు అద్దాలను ధ్వంసం చేసిన విషయం విధితమే. దీంతో జోగి కుటుంబంపై పోలీసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదు చేశారు.