సిద్ధవటంలో వెలుగులోకి మరో శాసనం

KDP: సిద్ధవటం మండలం జ్యోతి గ్రామంలోని పెన్నానది ఒడ్డున వెలసిన జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయానికి బాగాన ఉన్న మండపంలో అడుగు భాగంలో మరో శాసనం వెలుగులోకి వచ్చింది. ఇటీవల శివరాత్రి సందర్భంగా దక్షిణ భారత పర్యాటక సంస్థ జిల్లా అధ్యక్షుడు జ్యోతి జార్జి ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఉన్న శివలింగాలను మండపాన్ని సందర్శించినప్పుడు అడుగున ఉన్న శాసనాన్ని కనుగొన్నారు.