అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లదు: ఎంపీ లావు
స్పీకర్ ఓంబిర్లా విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఓంబిర్లా సభలో అందరికీ అవకాశం ఇస్తారని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ముందుకు వెళ్లదని, అవిశ్వాసం నెగ్గేందుకు కావాల్సిన బలమూ ప్రతిపక్షానికి లేదన్నారు. అవిశ్వాసం నెగ్గదని ఇండియా కూటమికి కూడా తెలుసన్నారు.