పదోన్నతి పొందిన అనంత లక్ష్మికి భజన మండలి ఘన సన్మానం

SRPT: హుజూర్ నగర్ శ్రీ అన్నమయ్య భజన మండలి గాయని శ్రీమతి దామెర అనంత లక్ష్మికి వైద్య ఆరోగ్య శాఖలో PHN నుంచి CHO (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)గా గెజిటెడ్ ఉద్యోగ పదోన్నతి లభించింది. ఈ మేరకు శ్రీ దుర్గమ్మ ఆలయ సన్నిధిలో మండలి తరఫున ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి వ్యవస్థాపక అధ్యక్షులు బాచిమంచి కొండయ్య, గౌరవ అధ్యక్షురాలు గుండా సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.