'ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత'

'ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత'

ADB: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. శుక్రవారం బోథ్ మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని గజేందర్ పేర్కొన్నారు.