పంట పొలంలోకి దూసుకెళ్లిన బస్సు

పంట పొలంలోకి దూసుకెళ్లిన బస్సు

కృష్ణా: పెద్దపారుపూడిలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.