VIDEO: 86 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

VIDEO: 86 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

NZB: నవీపేట్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా మండలానికి చెందిన 86 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వెంకటరమణ, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.