వారిని దత్తత తీసుకుంటున్నా: కొల్లు రవీంద్ర
AP: మంత్రి కొల్లు రవీంద్ర మానవత్వం చాటుకున్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే పీ4 కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. మచిలిపట్నంలోని పెద్దపట్నంలో నివాసం ఉంటున్న యానాది కుటుంబాల దయనీయ స్థితి చూసి.. వారిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలైనా ఇంకా తిండి, బట్ట కోసం ప్రజలు కష్టాలు పడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.