ఆరోగ్య పరిరక్షణపై కార్యక్రమాలు

ఆరోగ్య పరిరక్షణపై కార్యక్రమాలు

ఆదిలాబాద్ జిల్లాలో స్వచ్ఛత, నీటి సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపునకు ఈ నెల 13, 14 తేదీల్లో విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ నెల అన్ని పంచాయతీల్లో “మన ఊరు – మన నీరు” కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 14న అన్ని పాఠశాల కాంప్లెక్సుల్లో “ఆరోగ్య జాతర” నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.