నల్లగుంట్ల గూడెంలో పొలం బడి కార్యక్రమం

ప్రకాశం: నల్లగుంట్ల గూడెంలో వ్యవసాయ శాఖ, GAP ఆధ్వర్యంలో గురువారం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జవహర్ లాల్ నాయక్ పాల్గొని కంది పంటలో విత్తనశుద్ధి గురించి రైతులకు ప్రయోగాత్మకంగా చూపించారు. అలాగే రైతులు పురుగు మందుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించాలని కోరారు.