ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
కోనసీమ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట మండలం బిళ్ళకుర్రు గ్రామంలో మహాదేవస్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూమిపూజ చేశారు. దేవాదాయశాఖ సీజీఎఫ్ నిధులు రూ.1 కోటి, దాతలు సహకారంతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.