APUWJ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ నియామకం
VZM: APUWJ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా విజయనగరం జిల్లాకు చెందిన శివప్రసాద్ నియమితులయ్యారు. ఈరోజు విజయవాడలో జరిగిన APUWJ రాష్ట్ర సమావేశంలో శివప్రసాద్ పేరును రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు ప్రకటించారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీగా శివప్రసాద్‌ను నియమించడం పట్ల జర్నలిస్ట్ మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.