రవాణా శాఖ అధికారులు ఆకస్మిక వాహన తనిఖీలు

మన్యం: జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గా ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం పోలీస్ సిబ్బందితో వై. కే.ఎం.నగర్ బెల్గాం వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్ చేసిన వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో సుమారు రూ. 12 వేల జరిమానా విధించామని AMBI సుమన్ కుమార్ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన మూడు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేశామని చెప్పారు.