డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టండి: కలెక్టర్

NTR: విజయవాడ నగర పరిధిలో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. నిర్వాహణ పరంగా ఎక్కడా లోపాలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. సోమవారం న్యూ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వరద, మురుగునీటి కాల్వల్లో ఎక్కడా అడ్డంకులు ఉండకుండా చూడాలని సూచించారు.