ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
SDPT: సిద్దిపేట కలెక్టరేట్ పక్కన గల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు. త్రైమాసిక పరిశీలనలో భాగంగా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను నియమావళి ప్రకారం ఓపెన్ చేసి సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల వారీగా మిషన్‌లను భద్రపరిచినట్లు పేర్కొన్నారు.