తణుకులో 'చేంజ్ మేకర్స్'.. 350 కిలోల ప్లాస్టిక్ సేకరణ

తణుకులో 'చేంజ్ మేకర్స్'.. 350 కిలోల ప్లాస్టిక్ సేకరణ

W.G: తణుకులో ప్లాస్టిక్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్ అధికారులు గురువారం కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల నుంచి సుమారు 350 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.