ప్రజా సంక్షేమమే జనసేన ధ్యేయం

ప్రజా సంక్షేమమే జనసేన ధ్యేయం

VZM: ప్రజా సంక్షేమమే జనసేన ధ్యేయమని జనసేన నేతలు పాలవలస యశస్వి, గురాన అయ్యలు అన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం చేసి, కేక్ కటింగ్ చేశారు. రక్తదాన శిభిరం, డొక్కా సీతమ్మ పేరుతో భారీ అన్నదానం జరిపారు.