రెండు బైకులు ఢీ... వ్యక్తికి తీవ్ర గాయాలు

TPT: ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో మంగళవారం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ముందు వెళుతున్న బైకును వెనుక వైపు నుంచి మరో బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎండీ పుత్తూరు దళితవాడకు చెందిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.