టీడీపీ ఎంపీని కలిసిన కళ్యాణదుర్గం సీఐ

ATP: హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్ధసారథిని కళ్యాణదుర్గం సీఐ యువరాజ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. కళ్యాణదుర్గం పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సీఐకు ఎంపీ సూచించారు. జూదం, అక్రమ మద్యం, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.