కొమురవెల్లి హుండీ ఆదాయం ఎంతంటే..?

కొమురవెల్లి హుండీ ఆదాయం ఎంతంటే..?

TG: సిద్ధిపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ ఆదాయం రూ.1,20,29,945 వచ్చింది. కొమురవెల్లిలోని ఆలయ ముఖ మండపంలో దేవాలయ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 28 రోజులకు గానూ రూ.1,20,29,945 నగదు, విదేశీ కరెన్సీ 34 నోట్లు, మిశ్రమ బంగారం 89 గ్రాములు, మిశ్రమ వెండి 6కిలోల 100గ్రా. వచ్చినట్లు అధికారులు చెప్పారు.