NTR విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
CTR: రామకుప్పం పోలీస్ స్టేషన్ సమీపంలో స్వర్గీయ NTR విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఈ విగ్రహం ఏర్పాటు ద్వారా ఆయన ఆశయాలు, సేవలు తరతరాలకు గుర్తుండేలా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.