సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

NGKL: ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు లావాదేవీల సమాచారాన్ని అందించవద్దన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఓటీపీ అడగవని, ఈ విషయం ప్రజలు గుర్తించుకోవాలని సూచించారు. ఈజీ మనీ కోసం ప్రయత్నం చేస్తే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.