'విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి'

'విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి'

ADB: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రధానోపాధ్యాయుడు కృష్ణ కుమార్ అన్నారు. బుధవారం బేల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలుస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతుల కల్పన అందుతుందని పేర్కొన్నారు.