VIDEO: శ్రీ లక్ష్మీనరసింహస్వామికి వైభవంగా నిత్య కళ్యాణం
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నిత్య పూజలు యథావిధిగా జరిగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ చేశారు. స్వయంభువులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన నిర్వహించారు. అనంతరం సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణోత్సవంలో భక్తుల జంటలు అధిక సంఖ్యలో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు.