కవిత వ్యాఖ్యలపై స్పందించిన MLC దయాకర్

SRPT: BRS నాయకులపై MLC కవిత వ్యాఖ్యలపై మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. కాళేశ్వరం స్కాంలో హరీష్ రావు, సంతోష్ రావుల పాత్రను కవిత కన్ పార్మ్ చేశారని తెలిపారు. దీంట్లో కేసీఆర్‌కు సంబంధం లేదని కవిత అనడం విడ్డూరంగా ఉందని, పదవుల విషయంలో ముగ్గురి మధ్య కొట్లాట జరుగుతుందని అర్ధమవుతోందని అన్నారు.