జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం
MHBD: జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురుస్తోంది. అకాల వర్షం కారణంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కోత దశలో ఉన్న పంటలు, ఆరబోసిన మిర్చి, ఇతర ధాన్యపు రాశులు తడిసి ముద్దవుతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మికంగా కురుస్తున్న ఈ వానతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.