ఈ ప్రాంతాల్లో నేడు కరెంట్ కట్
PLD: అత్యవసర మరమ్మతుల కారణంగా శుక్రవారం నకరికల్లులో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ సుచరిత తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కండ్లగుంట, చాగల్లు, చీమలమర్రి, దేచవరం, శాంతినగర్, రూపేనగుంట, పమిడిపాడు, తదితర గ్రామాల్లో కరెంట్ ఉండదని చెప్పారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.