VIDEO: అక్రమ ఇసుక రవాణా.. 8 ట్రాక్టర్లు స్వాధీనం

VIDEO: అక్రమ ఇసుక రవాణా.. 8 ట్రాక్టర్లు స్వాధీనం

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ఆకేరు వాగు నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు దాడులు నిర్వహించి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.