నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్
JN: రఘునాథపల్లి (మ)లో జరుగుతున్న జీపీ నామినేషన్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ఈ రోజు పరిశీలించారు. MPDO కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్ల సిద్ధత, సిబ్బంది కేటాయింపు, ఎన్నికల సామగ్రి అందుబాటు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. నామినేషన్ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.