లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ
MNCL: అనారోగ్యానికి గురైన నిరుపేదలకు కార్పోరేట్ వైద్య చికిత్స అందించేందుకు CMRF పథకం వరం లాగ పని చేస్తుందని మాజీ ZPTC సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం వేమనపల్లి మండలం ముల్కలపేట, నీల్వాయి, వేమనపల్లి, జాజులు పెట్‌లకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు.