VIDEO: బండారుపల్లి మోడల్ పాఠశాలలో మాక్ పార్లమెంట్
MULG: ములుగు మండలం బండారుపల్లిలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలలో శనివారం మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు స్పీకర్, మంత్రులు, ఎంపీల పాత్రల్లో ఒదిగిపోయి పార్లమెంట్ కార్యకలాపాలను ప్రదర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ దేవకి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సహంగా పాల్గొన్నారు.