'నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం'
BHPL: మహదేవపూర్ మండలంలోని ఇసుక క్వారీల వద్ద లారీలపై టార్పాలిన్ (పట్టా) కట్టడం, లెవలింగ్ చేయడం నిషేధించినట్లు SI పవన్ కుమార్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో ఆదివారం SI మాట్లాడుతూ.. రెండు గ్రూపుల మధ్య వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.