'విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి'

అన్నమయ్య: విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి అన్నారు. సోమవారం మదనపల్లె ప్రభుత్వ బీటీ డిగ్రీ కళాశాల నందు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ... 25-26 గాను డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అనంతరం అలాగే బ్రిడ్జి కోర్సులు నేటితో ముగిశాయని చెప్పారు.