మధురవాడలో పర్యటించిన జోనల్ కమిషనర్

మధురవాడలో పర్యటించిన జోనల్ కమిషనర్

విశాఖ: మధురవాడ పరిధిలోని జీవీఎంసీ 7వ వార్డు మొగదారమ్మ కాలనీ, నగరం పాలెంలో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు శుక్రవారం పర్యటించారు. స్థానికుల సమస్యలను తెలుసుకుని వాటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్లా వెంకటరావు, జీవీఎంసీ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.