అపార్, యూడైస్ పనులను పూర్తిచేయండి: కలెక్టర్
NZB: జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపల్స్ సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఇవాళ జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వెంటనే విద్యార్థుల అపార్, యూడైస్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి కళాశాల ప్రిన్సిపల్ ఖచ్చితంగా ఆపార్, యూడైస్, పిన్ నంబర్లను విద్యార్థులకు అందజేయాలన్నారు.