జనసేన ఆఫీస్ వద్ద కాపు నేతల నిరసన
AP: కాపు విదేశీ విద్యా దీవెన నిధులు రూ.90 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ కార్యాలయం వద్ద కాపు నేతలు నిరసన చేపట్టారు. గతంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు విన్నవించినా స్పందన లేదని సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిధులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.