పామూరులో ఘనంగా అంబలి పూజ

పామూరులో  ఘనంగా అంబలి పూజ

ప్రకాశం: పామూరులోని స్థానిక అయ్యప్పస్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి అయ్యప్పస్వామి మహా అంబలి పూజను నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పామూరులోని ఐదు అశ్వాలతో ఊరేగింపుగా దేవస్థానంలోకి తీసుకువచ్చారు. అనంతరం దేవస్థాన ఆవరణలో అయ్యప్పస్వామి భజనను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.