భార్యతో గొడవపడి భర్త సూసైడ్
నెల్లూరు రూరల్లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్య అఫ్రిన్‌తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.