స్ట్రామ్ వాటర్ పైప్ లైన్ పనులు పరిశీలన
RR: కొత్తపేట డివిజన్ పరిధిలోని గాయత్రిపురం, నాగేశ్వరరావు కాలనీలో కొనసాగుతున్న స్ట్రామ్ వాటర్ పైప్‌లైన్ పనులను కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.