ఇకనైనా సూర్య ఆట మారుతుందా?
భారత T20 కెప్టెన్ సూర్య ఆట ఆందోళనకరంగా మారింది. కెప్టెన్సీ భారంగా మారిందో, బ్యాటింగ్‌లో పస తగ్గిందో తెలియదు కానీ ఒకప్పటి తన స్థాయికి తగ్గ ఆట ఆడలేకపోతున్నాడు. గత 19 ఇన్నింగ్స్‌లలో 222 పరుగులే చేసిన అతను 2 సార్లు మాత్రమే 30+ స్కోర్ చేశాడు. ఇందులో ఒక్కటీ హాఫ్ సెంచరీ లేకపోవడం గమనార్హం. SAతో ఇవాళ జరిగే 2వ T20 నుంచి అయినా అతని ఆట మారాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.