జిల్లాలో దొంగఓటు కలకలం
BDK: భద్రాచలం గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ బూత్‌లో దొంగఓటు కలకలం రేగింది. గ్రామంలోని 11వ నెంబర్ పోలింగ్ బూత్‌లో కోటగిరి లక్ష్మీ అనే మహిళ ఓటు వేసేందుకు వెళ్లగా అప్పటికే ఆ పేరుతో ఓటు పోల్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులతో ఆమె బంధువులు వాగ్వాదనికి దిగగా, ఆమెతో టెండర్ ఓటింగ్ ద్వరా ఓటు వేయించారు. ఆ ఓటును పరిగణలోకి తెసుకుంటారో లేదో అని అ మహిళ ఆందోళన చెందారు.