VIDEO: నర్సంపేటలో ఉచిత వైద్య శిబిరం
WGL: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భానుజీపేట AAM నర్సంపేట-3లో డా.జూనెద్ ఖాన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లుచే రోగులను పరీక్షించి రక్తనమూనాలను సేకరించారు. అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో150 మందికిపైగా పరీక్షలు చేసినట్లు డాక్టర్ శ్రవణ్ తెలిపారు.