వీధి విక్రయదారులకు.. ఆర్థికంగా చేయూత

వీధి విక్రయదారులకు..  ఆర్థికంగా చేయూత

VKB: వీధి విక్రయదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం PM ఆత్మనిర్భర్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. వీరిని అధిక వడ్డీల భారం నుంచి గట్టెక్కించి స్వశక్తితో నిలదొక్కుకునేలా చేయడం దీని ఉద్దేశం. ఈ క్రమంలోనే మూడు విడతలుగా వీధి వ్యాపారులను గుర్తించి ఆర్థిక సాయం అందజేయనుంది. ఈ అవకాశాన్ని పరిగి పరిధిలోని వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.